హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాను తమిళనాడు తరహాలో అమ లు చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. మోదీ సర్కారు పార్లమెంట్లో కర్కశంగా ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ బిల్లు ను ఆమోదించిందని, దీనిని తమిళనాడు పూర్తిస్థాయిలో కాకుండా కేవలం 3 శాతం కోటానే ఇస్తున్నదని తెలిపారు. తెలంగాణలోనూ ఇదే పద్ధతిలో అమలు చేయాలని చెప్పారు. జనాభాలో ఐదు శాతం లేనివారికి 10 శాతం రిజర్వేషన్లు ఎందుకని, ఈ కోటాతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు.