Teenmar Mallanna | హైదరాబాద్ : అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలతో తీన్మార్ మల్లన్న బీసీ బిల్లుపై చర్చించారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ నేతలను తీన్మార్ మల్లన్న కోరారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ప్రభుత్వం బీసీ బిల్లు తేవటం కాదు. అవసరం అయితే కేంద్రంలో ఆమోదం కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని సీఎంకు డిమాండ్ చేస్తున్నాం. మీ సహకారం కావాలని మల్లన్న కోరారు.
కేటీఆర్, హరీష్ రావులను అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేధికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన తీన్మార్ మల్లన్న pic.twitter.com/LGbsEDXd3Q
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2025