తిరుపతి : మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్సీని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమళ్లు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారేడు శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కొలుకుల జగన్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.