డోర్నకల్, అక్టోబర్ 16 : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. బుధవారం ఆమె మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల భవనాలకు అద్దె చెల్లిస్తలేదని, కాలేజీ యాజమాన్యాలకు ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. చదువును పక్కన పెట్టి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు రోడ్లపై ధర్నాలు చేసే దుస్థితికి తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్ చెల్లించకుండా పేద వి ద్యార్థులకు చదువును దూరం చేస్తున్నారని, వారికి అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీ సహించదని హెచ్చరించారు. మూసీ సుందరీకరణ కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసే కాం గ్రెస్ సర్కార్ దగ్గర.. భవనాల అద్దె, ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ చెల్లించేందుకు పైసలు లేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్ర భుత్వం ఏర్పడి 10 నెలలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రం ఏర్పడే నాటి కి తెలంగాణలో 273 గురుకుల పా ఠశాలుండేవని, అ ప్పటి సీఎం కేసీఆర్ వాటిని 1028కి పెంచి నాణ్యమైన విద్యను అందించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం, విద్య, ఎస్సీ, ఎస్టీ శాఖలకు మంత్రులు లేరని, సమీక్షలూ లేవని విమర్శించారు.