హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీచేయాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి కోరారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను హైదరాబాద్లో కలిసి వినతిపత్రం సమర్పించారు.
మాడల్ స్కూళ్లను ప్రత్యేక సొసైటీ కింద కాకుండా విద్యాశాఖలో విలీనం చేయాలని సూచించారు. ఈ విషయం ఇప్పటికే ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని, ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ప్రొగ్రెసివ్ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తరాల జగదీశ్ తదితరులు వినతిపత్రం సమర్పించినవారిలో ఉన్నారు.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార వేదిక అయిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు సోమవారం సీఎస్ కే రామకృష్ణారావును సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.