హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ) : మాడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. 010 పద్దు ద్వారా వేతనాలు, నోషనల్ సర్వీసు, ఇంక్రి మెంట్, హెల్త్‌కార్డుల కోసం ప్రయ త్నిస్తానని చెప్పారు. ప్రోగ్రెసివ్ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసి యేషన్ (పీఎంటీఏటీఎస్) ఆధ్వర్యంలో ఆదివా రం హైదరాబాద్‌లో ఆయ నను ఘనం గా సన్మానించారు. ఈ సంద ర్భంగా పలు పెండింగ్ సమస్యలను శ్రీపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఈ మేర కు ఆయన స్పందించారు. కార్యక్రమంలో పీఆర్టీ యూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్‌రెడ్డి, పీఎంటీఏటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తరాల జగదీశ్, అనుముల పోచయ్య, సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాము, స్లీవ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.