హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తేతెలంగాణ): పదో తరగతి పరీక్షల నిర్వహణలో అంతరాన్ని తగ్గించాలని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఒక్కో పరీక్ష మధ్య ఐదు రోజుల వ్యవధి ఉన్నదని, తద్వారా పరీక్షల పూర్తికి నెల సమయం పడుతున్నదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం పరీక్షల నిర్వహణలో అంతరం తగ్గింపును పరిశీలించాలని తన కార్యాలయ కార్యదర్శి అజిత్‌రెడ్డిని ఆదేశించారు.