హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జరుగనున్న ఐదు ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగియనున్నది. రేపు నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 20న ఎన్నికలు నిర్వహించి, అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నెల 29తో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి.