హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : జనవరి 3వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్న టెట్‌ను వాయిదా వేయాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. గురువారం ఆయన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఇన్చార్జి డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఇరవై రోజులుగా టీచర్లు పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్నందున టెట్‌కు సన్నద్ధమయ్యే సమయంలేకుండా పోయిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): ఇరుపక్షాల అంగీకారంతో కేసులను రాజీ చేసేందుకు రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 21న లోక్‌అదాలత్ జరుగనున్నది. చెక్ బౌన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, కార్మిక వివాదాలు, మ్యాట్రిమోనిల్, సివిల్ కేసుల రాజీకి లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి గురువారం ప్రకటనలో పేరొన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. కేసుల పరిషారానికి ఆసక్తి చూపేవాళ్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, న్యాయ సేవాసదన్, మండల న్యాయసేవా కమిటీలను సంప్రదించాలని సూచించారు.