MLC Madusudhana Chary | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి బహిరంగ లేఖ రాశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంతాపం తెలిపేందుకు శాసన మండలిని సమావేశపరచక పోవడం భాధాకరమని మధుసూదనాచారి తన లేఖలో పేర్కొన్నారు. పెద్దల సభకు సుదీర్ఘ కాలం పని చేసిన మన్మోహన్ సింగ్కు రాష్ట్రంలోని పెద్దల సభ సంతాపం తెలిపితే సముచితంగా ఉండేదని ఆయన తెలిపారు. ఇది తన అభిప్రాయం కాదు శాసనమండలి హృదయ వేదన అని మధుసూదనాచారి పేర్కొన్నారు. శాసన మండలిని చిన్న చూపు చూడటం తగదు. భవిష్యత్లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకూడదు అని రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మధుసూదనాచారి సూచించారు.
ఇవి కూడా చదవండి..
Prabhas | డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. న్యూ ఇయర్ వేళ ప్రభాస్ వీడియో మెసేజ్!