Madhusudhana Chary | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం శాసనమండలి ప్రాంగణంలో తనకు కేటాయించిన చాంబర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారిని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి హరీశ్‌రావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేటీఆర్ సూచించారు.
మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు మహమూద్ అలీ, జీ జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దేశపతి శ్రీనివాస్, వాణీదేవి, నవీన్ కుమార్‌రెడ్డి, తాతా మధు, యాదవరెడ్డి, టీ రవీందర్రావు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, దేవీ ప్రసాద్, గజ్జెల నగేశ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుల ఉమ, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సిరికొండకు అభినందనలు తెలిపారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నాయకులు మేడే రాజీవ్‌సాగర్, పల్లె రవికుమార్, కిషోర్‌గౌడ్, ఉపేంద్రాచారి, రాగిడి లక్ష్మారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.