హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నెల్లికల్లు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూములకు పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి డిమాండ్చేశారు.
మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 24వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, రూ.664 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించినట్టు వెల్లడించారు. గిరిజన రైతాంగానికి మేలు చేసే ఈ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.