శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ అనే పాటను రిలీజ్ చేశారు.
ఈ పాటకు సునాద్ గౌతమ్ స్వరాల్ని అందించగా రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించారు. రామ్ మిర్యాల ఆలపించారు. తండ్రి ప్రేమ తాలూకు భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. గ్రామీణ వాతావరణంలో సాగే హృద్యమైన కథాంశమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సునద్ గౌతమ్, దర్శకత్వం: మనోజ్‌కుమార్.