చేనేత మగ్గంపై కళాఖండాలతో పట్టుచీర!
సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతం సృష్టించారు. గుంటూరుకు చెందిన రత్నకుమారి-కోటేశ్వరరావు ప్రత్యేకంగా ఇచ్చిన ఆర్డర్ మేరకు 45రోజులపాటు శ్రమించి, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దివ్యచరిత్రను పట్టుచీరపై అద్భుతంగా ఆవిషరించారు.
- 45 రోజుల్లో నేసిన సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతం సృష్టించారు. గుంటూరుకు చెందిన రత్నకుమారి-కోటేశ్వరరావు ప్రత్యేకంగా ఇచ్చిన ఆర్డర్ మేరకు 45రోజులపాటు శ్రమించి, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దివ్యచరిత్రను పట్టుచీరపై అద్భుతంగా ఆవిషరించారు. ఈ ప్రత్యేక పట్టుచీరలో 102 మంది రుషుల పేర్లు, 102 గోత్రనామాలు, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రను ప్రతిబింబించే 25 చారిత్రక చిత్రాలను చేనేత మగ్గంపై అత్యంత నైపుణ్యంతో నేశారు. ఒకో అక్షరం, ఒకో చిత్రం, ఒకో గోత్రనామాన్ని మగ్గంపై పొందుపర్చడం ద్వారా హరిప్రసాద్ తన చేనేత ప్రతిభను మరోసారి చాటుకున్నారు.
ఈ అరుదైన కళాఖండాన్ని పూర్తిగా పట్టుదారం, రెండు గ్రాముల బంగారు జరి ఉపయోగించి రూపొందించారు. ఏడు మీటర్ల పొడవు కలిగిన ఈ పట్టు చీరలో భక్తి, చరిత్ర, ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి, చేనేత కళా నైపుణ్యంతో తయారు చేయడం విశేషం. హరిప్రసాద్ ఇటీవలే 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చేనేత మగ్గంపై నేసి ఔరా అనిపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

