హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : టీచర్ల ఏకీకృత సర్వీస్ రూ ల్స్ రూపొందించాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కోరారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందప్రదాన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
కేజీబీవీ, ఎస్ఎస్ఏ, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరారు. కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హెచ్ఎం పదోన్నతులకు బీఈడీ అర్హతగా చేర్చడానికి ఎన్సీటీఈ మార్గదర్శకాలు సవరించాలని కోరారు.