హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్‌కు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ ద్వారా తెలిపారు. డీజీపీ, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేస్తూ.. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలుమార్లు హ్యాకింగ్‌కు ప్రయత్నించారని వెల్లడించారు. తన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలు హ్యాక్ అయ్యాయని, దుండగులు ఖాతాల్లోకి అనుమానాస్పదంగా లాగిన్ అయ్యారని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్టు చేశారని పేర్కొన్నారు.