హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో ఆమెను సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 7న చార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. దీంతో విచారణను ఈ నెల 7కు వాయిదా వేసిన న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 7 వరకు పొడిగించింది. ఇక ఈడీ కేసులో కవిత కస్టడీని జూలై 3వ తేదీ వరకు పొడిగించింది.