హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ) : ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి నాయకులు ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలోని మండలి, శాసనసభ ప్రతిపక్ష నాయకుల చాంబర్లలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సమక్షంలో ఎమ్మెల్సీ కవిత వేర్వేరుగా కేక్ కట్ చేశారు. సభ్యులు ఆమెకు కేక్ తినిపించి, పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, వైస్ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు సురభివాణీదేవి, మహమూద్‌అలీ, శంభీపూర్‌రాజు, నవీన్‌రెడ్డి, గొరటి వెంక న్న, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కోటిరెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పల్లారాజేశ్వర్‌రెడ్డి, కోవలక్ష్మి, కౌశిక్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్ పాల్గొన్నారు. పర్యావరణవేత్త, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపు మేరకు తెలంగాణభవన్ వద్ద టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహిళా నేతలు మొక్కలు నాటారు. పూరి తీరంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో కళాకారులు వేసిన ఎమ్మెల్సీ కవిత శిల్పం సందర్శకులను ఆకట్టుకుంది. సైకత శిల్పంలో ‘ది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రీచ్’ అని పేర్కొన్నారు.