సింగోటం: ఎమ్మెల్సీ కవిత (Kavitha) నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సింగోటంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సిబ్బంది శేషవస్త్రంతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు. కవితతోపాటు ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, అభిలాష్‌రావు లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.
కొల్లాపూర్ లోని సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. pic.twitter.com/U5qxXqt3qH
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 28, 2025