హైదరాబాద్: దిల్సుఖ్నగర్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా పాల్గొన్నారు.
అంతకుముందు ఆలయం వద్ద ఎమ్మెల్సీ కవితకు ఆలయ సిబ్బంది, స్థానిక టీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.