
Kavitha | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంతో వెల్లివిరుస్తోందని ఎమ్మెల్సీ కవిత సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు. తన ట్విట్టర్లో నిజామాబాద్ జిల్లా నాళేశ్వర్కు చెందిన ఓ రైతును ఉటంకించారు. నాళేశ్వర్కు చెందిన బాగాజి పోశెట్టి తన అర ఎకరంలో రైతుబంధు పెట్టుబడితో వ్యవసాయం చేస్తున్నాడని, పింఛన్ డబ్బుతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
నిజామాబాద్ జిల్లా నాళేశ్వర్ కు చెందిన బాగాజి పోశేట్టి తన అర ఎకరంలో #రైతుబంధు పెట్టుబడితో వ్యవసాయం చేయడంతో పాటు, ఫించన్ డబ్బులతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలందరికీ చేరవేస్తున్న సీఎం శ్రీ కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది pic.twitter.com/DGlUwBfRjl
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 5, 2022