హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం 2012లో 48 గంటల పాటు దీక్ష చేసిన విషయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో పంచుకున్నారు. పదేళ్ల మధుర జ్ఞాపకం అంటూ కవిత ట్వీట్ చేశారు.
భారత రాజ్యాంగ రూపకర్త, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన అంబేద్కర్ విగ్రహం చట్ట సభలో ఏర్పాటు చేయాలని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వేదికగా 2012 ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 15 వరకు కల్వకుంట్ల కవిత 48 గంటల దీక్ష చేశారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎమ్మెల్సీ కవిత దీక్షకు మద్దతుగా నిలిచాయి. ఎమ్మెల్సీ కవిత దీక్షకు తలొగ్గిన ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
This day 10 years ago, we led a successful protest for installation of #BabasahebAmbedkar Statue in United Andhra Pradesh Assembly.#MajorThrowback pic.twitter.com/yeWZ2VCQpY
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 13, 2022