MLC Kavitha | మహారాష్ట్ర సోలాపూర్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. స్థానికంగా జరిగే బతుకమ్మ సంబురాల్లో పాల్గొననున్నారు. నగరంలోని పుంజాల్ మైదాన్‌లో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొననున్న ప్రవాస తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడనున్నారు. సంభకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు ముమ్మరం చేశారు. నగరంలోని దత్తవాడ నుంచి సాయంత్రం 5గంటలకు ప్రారంభమయ్యే బతుకమ్మ శోభయాత్రలో కవిత పాల్గొంటారు.
ఈ శోభయాత్ర సాయంత్రం 6 గంటలకు అక్కల్ కోట్రోడ్లోని పుంజాల్ మైదాన్‌ను చేరుతుంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మలు తలకెత్తుకొని నగరంలోని ఆడబిడ్డలు పెద్దఎత్తున కార్యక్రమానికి తరలిరావాలని.. నిర్వాహకులు ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేశారు. సోలాపూర్‌లో జరిగే కార్యక్రమానికి కవిత హాజరుకావడం తమకు ఆనందంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు నగేశ్ వల్యాల్, దశరథ్ గోప్ పేర్కొన్నారు.