
హైదరాబాద్ : పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర డైరీని హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ కవిత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే అంచెలంచెలుగా ఎదిగి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న పీఆర్టీయూ టీఎస్ కార్యవర్గానికి, సభ్యులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
