హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : హెచ్సీయూ భూములపై సుప్రీం కోర్టు స్టే విధించడం ప్రజాస్వామిక విజయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. హెచ్సీయూ పచ్చదనంపై సర్కారు చేపట్టిన విధ్వంసాన్ని ఆపినందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
న్యాయ పోరాటంలో ధృఢంగా నిలిచిన విద్యార్థులు, అధ్యాపకులు, మీడియా, బీఆర్ఎస్ కార్యకర్తల అవిశ్రాంత కృషిని అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో చివరికి న్యాయమే గెలుస్తుందని ఆకాంక్షించారు.