హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు పుట్టినరోజు ఈవాళ. 45 వసంతాలు పూర్తిచేసుకుని 46వ పడిలోకి ఆయన అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ… హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఈ ఏడాది మీకు పూర్తి సంతోషాలు, విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నట్లు కవిత పేర్కొన్నారు. కవిత శుభాకాంక్షలపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ థాంక్యూ పప్పు అని హాస్య ఎమోజీని జోడించారు.