హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కవిత రాజశ్యామల పూజ నిర్వహించి అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బల్కంపేట అమ్మవారి ఆలయం రోజురోజు అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శివ భక్త మార్కండేయ ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.