Mlc Kavitha | రాష్ట్రవ్యాప్తంగా పింక్ వేవ్.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఫేక్ సర్వేలు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Mlc Kavitha | రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్(CM KCR) చరిత్ర సృష్టించనున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) అన్నారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్(CM KCR) చరిత్ర సృష్టించనున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా పింక్ వేవ్(Pinkwave) కనిపించిందని పేర్కొన్నారు.
పెద్దమ్మ తల్లి దయవల్ల ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమాల గడ్డని, చైతన్యవంతమైన ప్రజలు ఉండడం వల్లే ప్రజలకు మేలు చేసే ప్రతినిధులు ఉండాలని ప్రజలు నిర్ణయించినట్లు అర్థమవుతోందని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి తమకు అందుతున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ (BRS) పార్టీకి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న పింక్ వేవ్ చూస్తే బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ని ఆశీర్వదించి ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. పోలింగ్ శాతం ఎంత ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గెలుపు తధ్యమని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే సంబరాలు జరుపుకుంటున్నామని, ఎమ్మెల్యేలు గెలుపు పట్ల విశ్వాసంతో ఉన్నారని అన్నారు. ప్రజలను తప్పదోవ పట్టించడానికి అనేక ఫేక్ సర్వేలు వస్తుంటాయని, గత ఎన్నికల్లోనూ ఇలానే జరిగిందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurukul Schools | తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి.. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకులంలో దుస్థితి!
Cyber Crime | తెలంగాణలో సైబర్ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!
KTR Bus Yatra | 11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

