హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల పనులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో నిజామా బాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, కావాల్సిన నిధులు తదితర అంశాలపై మంగళవారం ఆమె మంత్రితో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, షకీల్ ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. బోధన్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నిధుల మంజూరు వంటి అంశాలపై ఎమ్మెల్సీ కవితతో షకీల్ చర్చించారు. ముఖ్యంగా రోడ్లు, సాగునీటి కాలువల అభివృద్ధి పై ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనలపై మంతనాలు జరిపారు. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ సీనియర్‌నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలో విశ్వబ్రాహ్మణ సామాజికవర్గ పెద్దలు ఎమ్మెల్సీ కవితతో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు.