
హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వమే పెట్టుబడి ఇచ్చి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతును రాజును చేసి, నవతరాన్ని సైతం సాగువైపు మళ్లించేలా స్ఫూర్తినిచ్చింది సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
బంగారు తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు ద్వారా అన్నదాతలకు అందిన పంట పెట్టుబడి సాయంసోమవారంతో రూ.50వేల కోట్లకు చేరనున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
