హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతుల పాలిట రాబందుగా మారిన కాంగ్రెస్ సర్కార్‌ను రైతాంగం క్షమించదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పాలమూరు వేరుశనగ రైతుల ఆందోళన కనిపించటం లేదా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ఆమె ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఒక పక వ్యాపారుల మోసం, మరోపక ప్రభుత్వం శీతకన్ను వేయడం వల్ల వేరుశనగ రైతుల ఆందోళనతో మహబూబ్‌నగర్ జిల్లా అట్టుడుకుతున్నదని తెలిపారు. పోలీసుల బందోబస్తు నడుమ వేరుశనగ కొనుగోలు జరపాల్సిన దుస్థితి రావడం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం మేలొని వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా మారెట్ యార్డుల్లో వ్యాపారులు, కమీషన్‌దారుల ఆగడాలను అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు.