హైదరాబాద్: ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగతో తెలంగాణ పులకించిందని, ఎంగిలిపూల బతుమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగిందని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
‘పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.’ అని ఎమ్మెల్సీ కవిత ట్విటర్లో పోస్టు చేశారు.
పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.#బతుకమ్మ #Bathukamma pic.twitter.com/WxYc9Oh36W
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 13, 2021