హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ):మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె జాతీయ మీడియాచానల్తో మాట్లాడు తూ.. నక్సలైట్లను అంతం చేయాలన్న పంతంతో బీజేపీ ముందుకెళ్తున్నదని, ఆ పంథా సరికాదని వెంటనే మార్చుకోవాలని కేసీఆర్ సూచించారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా మావోయిస్టులను శాంతిచర్చలకు పిలిచి పరిష్కారాన్ని కనుక్కోవచ్చని రజతోత్సవ సభలో కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు.‘గతంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లను అం తం చేయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ గ్రీన్‌హంట్’ చేపట్టిందని, అది విజయవంతం కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ చేపట్టిందని, దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని ఒక జిల్లాలో తీవ్రమైన ఆందోళన నెలకొన్నదని వివరించారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 3,500 పైచిలుకు నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని తెలిపారు. ‘కేం ద్రం సానుకూల వాతావరణంలో మావోయిస్టులను చర్చలకు పిలవాలి. చర్చలకు మావోయిస్టులను పిలిచే క్రమంలో రెడ్కారిడార్లో ఉన్న రాష్ర్టాలను, రాజకీయ పార్టీలను సైతం పిలవాలి’ అని కవిత సూచించారు.
చర్చలకు ప్రభుత్వం ఒత్తిడితేవాలి: రాఘవులు
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తేతెలంగాణ): ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, వెంటనే శాంతి చర్చలు ప్రారంభించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆ దిశగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సభ్యురాలు జ్యోతితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో హింసవు తావులేదని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని గనుల కోసమే మోదీ సర్కారు మావోయిస్టులను అంతమొందిస్తున్నదని రాఘవులు ధ్వజమెత్తారు.