చండూరు, మార్చి 12 : రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు పల్లె రవికుమార్‌గౌడ్ మంగళవారం తెలంగాణ భవన్లో ప్రమాదవశాత్తు జారి పడడంతో కాలు విరిగింది. గాయపడిన రవిని బుధవారం ఎల్బీనగర్లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆమెతోపాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మనుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు కాచం సత్యనారాయణ, బోల్ల శివశంకర్, అందోజు శంకరాచారి, నిరంజన్ గౌడ్, ఈడం కైలాస్ నేత నక్క సుధీర్, వర్కాల అంబేద్కర్ ఉన్నారు.