హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వెలమ సామాజికవర్గాన్ని కించపరుస్తూ షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మె ల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలు ఒక ప్రజాప్రతినిధి స్థాయికి తగదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హితవు పలికారు. ఎమ్మె ల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరా? అనేది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలియజేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు
జగిత్యాల కలెక్టరేట్, డిసెంబర్ 6 : వెలమ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపెల్లి శంకర్‌పై చర్యలు తీసుకోవాలని వెలమ సంక్షేమ మండలి జగిత్యాల శాఖ నాయకులు శనివారం జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుత ఎమ్మెల్యే పదవిలో ఉండి వెలమ కులస్తుల అంతు చూస్తామని బెదిరించడం, అసభ్యపదజాలంతో దూషించి మనోభావాలను గాయపర్చారని, ఆయనపై చర్యలు తీ సుకోవాలని కోరారు. వెలమ సంక్షేమ మండలి ప్రతినిధులు ఐల్నేని సాగర్‌రావు, వేణుగోపాల్‌రావు, వీ కృష్ణారా వు, ఫురుషోత్తంరావు పాల్గొన్నారు.