వరంగల్ : బీజేపీ నాయకులపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. సోమవారం చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీజేపీకి వరంగల్‌లో సభ పెట్టే అర్హత లేదన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేని చవటలు బీజేపీ నాయకులు అని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ , కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది..? బీజేపీ తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటీ..? బిడ్డా సంజయ్.. ఇది ఉద్యమాల గడ్డా, టీఆర్ఎస్ గడ్డా, ఖబడ్దార్..? అని హెచ్చరించారు.
కేసీఆర్‌ను విమర్శించే అర్హత సంజయ్‌కు లేదన్నారు.
మధ్యప్రదేశ్, అస్సాం సీఎంలకు మతి ఉందా? అభివృద్ధి సూచీలో మీరెక్కడున్నారో తెలుసా? మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తోందని మండిపడ్డారు. మతోన్మాదులకు తెలంగాణలో చోటు లేదు. తెలంగాణ బాహుబలి కేసీఆర్అ భివృద్ధిని ఓర్వలేకనే బీజేపీ రాష్ట్రంపై దాడి చేస్తోందన్నారు.
బీజేపీ సీఎంలు, మంత్రులు, నాయకులు సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
గతంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకున్న వారే ఇప్పుడు దూషిస్తున్నారు. బీజేపీ నాయకులు పగటివేషగాళ్లలా వ్యవహరిస్తున్నారు. బీజేపీ బలహీన పడటంతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. బీజేపీది రాజకీయ దివాళకోరుతనం అని కడియం ధ్వజమెత్తారు.