Jeevan Reddy | ‘ మీకు.. మీ పార్టీకి ఓ దండం.. ఇకనైనా మమ్మల్ని బతనివ్వండి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రధాన అనుచరుడు, జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి (58)ని దారుణంగా హత్య చేయడంతో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గంగారెడ్డి హత్యను నిరసిస్తూ తన అనుచరులతో కలిసి జగిత్యాల-ధర్మపురి రహదారిపై జీవన్ రెడ్డి ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌తో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ మాకు నలుగురికి సేవ చేయడమే తెలుసు.. ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని అయినా ప్రజలకు సేవ చేస్తా. ఇక మీకు.. మీ పార్టీకి ఓ దండం. ఇకనైనా మమ్మల్ని బతకనివ్వండి. ఇంతకాలం అవమానాలకు గురైనా తట్టుకున్నాం.. మానసికంగా అవమానాలకు గురవుతున్నా భరించాం.. కానీ ఇవాళ భౌతికంగా లేకుండా చేస్తే ఎందుకు.’అని అడ్లూరి లక్ష్మణ్‌ను జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
మీకు.. మీ కాంగ్రెస్ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి”.. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్#JeevanReddy #Congress #Telangana #Hyderabad #MLC #CMRevanthReddy pic.twitter.com/6GPlOMuB34
— Telangana Bolo Re (@TelanganaBoloRe) October 22, 2024
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి హత్య జగిత్యాల జిల్లాలో సంచలనం రేపింది. తన ప్రధాన అనుచరుడి హత్య గురించి తెలియగానే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. గంగారెడ్డి హత్యను నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట ఆయన ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నాయకుల్నే ఇంత దారుణంగా హత్య చేసిన తర్వాత అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు. తన అనుచరుడిని హత్య చేయడం అంటే తనను కూడా హత్య చేసినట్లే అని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్రీయాశీలకంగా పార్టీలో పనిచేస్తే చంపేస్తారా అని ప్రశ్నించారు. గంగారెడ్డిని చంపిన వారిని పట్టుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
‘