హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ప్రజాకవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతోపాటు ప్రముఖ విద్యావేత్త ప్రేమ్రావత్కు బీఆర్ఏవోయూ(బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ)గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్టు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. ఈ మేరకు గురువారం యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ఈ నెల 30న యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు. స్నాతకోత్సవంలో 35మంది గ్రాడ్యుయేట్లకు, 51మంది పోస్టుగ్రాడ్యుయేట్లకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు.