హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): న్యూజిలాండ్‌లో తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖ కవి, గాయకుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బుధవారం వెళ్లారు. ఆక్లాండలో జరిగే వేడుకల్లో పాల్గొనాలని అసోసియేషన్ అధ్యక్షుడు కల్యాణ్‌రావు కాసుగంటి ఆహ్వానం మేరకు వెళ్లారు.
గోపాల్‌ను స్వదేశానికి తీసుకొస్తా
మహబూబ్‌నగర్ అర్బన్, మే 28 : మహబూబ్‌నగర్ జిల్లా హన్వా డ మండలం పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ దుబాయిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అతడిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇచ్చిన మాట మేరకు.. బుధవారం దుబాయి వెళ్లిన ఆయన గోపాల్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న అడ్వకేట్, లీగల్ కన్సల్టెంట్ బొబ్బిలిశెట్టి అనురాధతో సమావేశమయ్యారు. గోపాల్ కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా బెయిల్ వచ్చేలా కృషి చేయాలని న్యాయవాదిని కోరారు. అనంతరం గోపాల్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు.