సుబేదారి, జనవరి2 : వరంగల్(Warangal) తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లు, వ్యాపార వేత్తలపై తప్పుడు కేసులు నమోదు చేసిన ఏసీపీ, ఇంతేజార్ గంజ్, మిల్స్ కాలనీ, మట్టెవాడ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య(MLC Saraiah) డీజీపీ వశీధర్ రెడ్డిని కోరారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్‌లో సారయ్య డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. 2023 డిసెంబర్ నుంచి కొందరు రాజకీయ పార్టీ నేతల ప్రోదల్బంతో కార్పొరేటర్లపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. వ్యాపార వేత్తలు, అమాయకులపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సారయ్య డీజీపీని కోరారు. కాగా, కొంతకాలంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు కొండా మురళి, సారయ్య వర్గాల మధ్య వర్గ పోరు నడుస్తుంది. సారయ్య వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని సారయ్య ఇప్పటికే వరంగల్ సీపీకి రెండు రోజుల క్రితం పిర్యాదు చేసారు. తాజాగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడం వరంగల్ అధికార పార్టీలో హార్ట్ టాపిక్‌గా మారింది.