హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే కేసీఆర్‌పై కేంద్ర హాంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. తెలంగాణ ప్రజలు బండి వ్యాఖ్యలను ఖండిస్తున్నారని, ఆయనను ఎంపీగా ఎన్నుకున్న కరీంనగర్ ప్రజలు సిగ్గుపడుతున్నారని ధ్వజమెత్తారు.
సోమవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్లో వివేకానంద మాట్లాడుతూ… బండి మాటలను బట్టి ఆయన మానసికస్థితి బాగాలేదనే విషయం అర్థమవుతున్నదని ఎద్దేవా చేశారు. నిజంగా బండి సంజయ్‌కు దమ్ముంటే రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు తీసుకురావాలని సవాల్ విసిరారు.