Vemula Prashanth Reddy | తెలంగాణను మళ్లీ ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టే కుట్ర : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
నిజాబామాబాద్ : కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలో మంగళవారం విజయ దివస్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూల దండ వేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ సాకారమైందన్నారు. సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
కానీ, ఈన కాచి నక్కల పాలు చేసినట్లు కేసీఆర్ కడుపులో పెట్టుకుని సాదుకున్న తెలంగాణ నేడు దోపిడి దొంగల పాలైందన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో రూ. వేల కోట్ల విలువైన భూములు అమ్మే పని సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షసుల, రాబందుల పాలన కొనసాగుతోందిదని మండిపడ్డారు. కేసీఆర్ బ్రహ్మాండంగా మార్చిన తెలంగాణను మళ్లీ ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టే కుట్ర చేస్తున్నారు. ఇట్లాంటి కుట్రలు ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలి అని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

