వేల్పూర్, అక్టోబర్ 11: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రమేశ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. పార్టీ తరఫున రూ. 2 లక్షల బీమా చెక్కు మంజూరైంది. ఈ మేరకు వేల్పూర్‌లోని తన నివాసంలో మృతుడి భార్య రజితకు శుక్రవారం అందజేశారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యత్వం కలిగిన కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల పైచిలుకు మంది బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. బీమా కోసం దాదాపు రూ.11 కోట్ల ప్రీమియం పార్టీ చెల్లిస్తున్నదని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 50 వేల మంది కార్యకర్తలు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇప్పటి వరకు 45 మందికి పైగా రూ.2 లక్షల చొప్పున పార్టీ ప్రమాదబీమా చెక్కులు కార్యకర్తల కుటుంబాలకు అందజేసినట్టు ఆయన పేర్కొన్నారు.