హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు గతంలో ఉన్న గదికి బదులుగా చిన్న గదిని కేటాయించడం తీవ్రంగా కలచి వేసిందని మాజీ మం త్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సభాపక్ష నాయకుడితోపాటు ప్రతిపక్ష నేతకు కూడా అదే స్థాయిలో చాంబర్‌ను కేటాయించడం అసెంబ్లీ గౌరవానికి వన్నె తెస్తుందని పేర్కొన్నారు. దీనిపై తాము స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి ప్రతిపక్ష నేతకు గతంలో ఉన్నంత చాంబర్‌ను కేటాయించాలని కోరినట్టు వెల్లడించారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మా ట్లాడుతూ.. ప్రతిపక్ష నేతకు కేటాయించిన చిన్న గదిలో తమ పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ఎలా కూర్చోని, మాట్లాడుకోవాలని ప్రశ్నించారు. దీనిపై స్వీకర్‌కు ఫిర్యాదు చేయగా కొత్త చాం బర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఓడిపోయిన కాంగ్రెస్ నేతల భార్యలు వచ్చేంత వరకూ ఎ మ్మెల్యేలను వెయిట్ చేయించడం దారుణమని చెప్పారు. సంగారెడ్డిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పాటించని ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విన్నవించగా, సీఎస్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు ఎస్కార్ట్ ఇస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గించడం దా రుణమని పేర్కొన్నారు. ఎస్కార్ట్ ఎవరికైనా సమానంగా ఇవ్వాలని స్పీకర్‌తోపాటు సీఎస్, డీజీపీకి విన్నవించినట్టు తెలిపారు.
కాంగ్రెస్‌ను పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని, వాళ్లే కూలగొట్టుకుంటారని వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉ న్నారంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యా ఖ్యలపై ఆయన స్పందించారు. ‘జగ్గారెడ్డే గెలవలేదు. ఆయన మా ఎమ్మెల్యేలను ఎలా తీసుకెళ్తారు? మా ఎమ్మెల్యేలను తీసుకెళ్లేంత మొ గోళ్లు కాంగ్రెస్‌లో లేరు. హామీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం తప్పదని, హామీల అమలు చేతగాక బీఆర్ఎస్పై నెపం నెడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, మాణిక్‌రావు పాల్గొన్నారు.