ఆశీర్వాద సభ కాదు.. రైతు శాపనార్థాల సభ
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. శి
- ప్రజాధనంతో పబ్లిసిటీ బంద్ చేయండి
- ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టండి
- 28 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టి..కేవలం రూ.2,500 కోట్లు ఇచ్చి ఆర్భాటాలా?
- రేవంత్‌పై మాజీ మంత్రి వేముల ఆగ్రహం
మోర్తాడ్/వేల్పూర్, జూలై 1: కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. శిల్పకళా వేదికలో నిర్వహించింది రైతుల ఆశీర్వాదసభ కాదని, అది అన్నదాతల శాపనార్థాల సభ అని పేర్కొన్నారు. రైతులు రేవంత్‌రెడ్డిని ఎందుకు ఆశీర్వదించాలి? రుణమాఫీ చేయనందుకా? రైతుబంధు ఎగ్గొట్టినందుకా? వడ్లు కొననందుకా? యూరియా ఇవ్వనందుకా? కరంట్ కట్ చేసినందుకా? బోనస్ ఎగ్గొడుతున్నందుకా? అని ప్రశ్నించారు. బుధవారం ఆయన నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆర్భాటాలు, వృథా ఖర్చులు లేకుండా కేవలం ఒక ప్రెస్‌మీట్ ద్వారా ప్రకటించి, 11 సీజన్లలో రూ.73 వేల కోట్లు రైతుబంధు నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశారని గుర్తుచేశారు. నాడు ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని వృథా చేయలేదని అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సీజన్లలో మూడు సీజన్ల రైతుబంధు ఎగ్గొట్టి దాదాపు రూ.28 వేల కోట్లు రైతులకు బాకీ పడిందని తెలిపారు. రూ.28 వేల కోట్ల పాత బాకీలో నుంచి కేవలం రూ.2,500 కోట్లు విదిల్చి దానికోసం వందల కోట్లతో సభలు పెట్టి అట్టహాసం చేయడం హాస్యాస్పదమని అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి తదుపరి ఇవ్వనున్నట్టు చెప్తున్న రూ.9 వేల కోట్లు కూడా రైతుల పాత బాకీల కిందికే వస్తాయని, కొత్తగా ఇస్తున్నదేమీ లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తే రైతులకు రూ.55 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఇచ్చింది కేవలం రూ.27 వేల కోట్లేనని, ఇంకా రూ.28 వేల కోట్లకుపైగా రైతుబంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తరువాత రైతుల నోట్లో మట్టి కొట్టిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా, కేవలం రూ.21 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకొన్నారని ధ్వజమెత్తారు.
రుణమాఫీ కాదు, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం మాఫీ అయ్యిందని ఎద్దేవా చేశారు. మంత్రి తుమ్మల ఏసీ రూముల్లో కూర్చుని యూరియా యాప్ బాగుందని, 90శాతం రైతులు సంతోషంగా ఉన్నారని మాట్లాడటం సరికాదని అన్నారు. ఇదే మాట గ్రామాల్లోకి వచ్చి రైతుల మధ్య నిలబడి చెబితే రైతులు.. ‘మీ గూబ గుయ్యుమనిపిస్తారు’ అని హెచ్చరించారు. మాట ఇస్తే తప్పను అని రేవంత్‌రెడ్డి అనడం ప్రపంచంలో 8వ వింత అని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తానని చెప్పి 900 రోజులైనా ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవడం మాట తప్పడం కాదా? ప్రశ్నించారు. రుణమాపీ విషయంలో దేవుళ్లందరిపైనా ఒట్లు పెట్టి మరీ అన్నదాతలను మోసం చేయడం మాట తప్పడం కాదా? అని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

