జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రైతులు మరోసారి పోరుబాట పడుతున్నారు. రైతు భరోసా, రుణమాఫీ, వరికి బోనస్‌పై కాంగ్రెస్ సర్కారు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించడం, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించడాన్ని నిరసిస్తూ నేడు కోరుట్ల నుంచి జగిత్యాల వరకు లాంగ్‌మార్చ్ చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా మంగళవారం కోరుట్లలో రైతు పాదయాత్రను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashant Reddy) బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి రైతు పాదయాత్రను(Rythu Padayatra) ప్రారంభించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల నేతృత్వంలో చేపట్టే ఈ పాదయాత్రలో రైతులు, రైతు కూలీలు, రైతు నాయకులతోపాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీధులన్నీ గులాబీ మయమయ్యాయి.
రైతులతో కలిసి కొనసాగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర
పాదయాత్రకు భారీగా తరలివచ్చిన రైతులు https://t.co/WDMexuYcBl pic.twitter.com/1nP7BmyZV5
— Telugu Scribe (@TeluguScribe) November 12, 2024