రాంనగర్, ఆగస్టు 26: పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్‌లో హెడ్‌కానిస్టేబుల్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు గన్‌మన్‌గా పనిచేస్తున్న మల్లయ్య శుక్రవారం మధ్యాహ్నం నుంచి కన్పించకుండా పోయారు. మల్లయ్య భార్య హేమలత ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 1996వ బ్యాచ్‌కు చెందిన మల్లయ్య ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు.
ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వద్ద గన్‌మన్‌గా పనిచేస్తున్న ఈయన గురువారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బ్యాంకులో పని ఉన్నదని చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతని భార్య శుక్రవారం రాత్రి పోలీసులు సమాచారం ఇచ్చారు. శనివారం సాయంత్రం వరకు ఆచూకీ లభించక పోవడంతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వన్‌టౌన్ సీఐ తెలిపారు.