హైదరాబాద్ : మూడు రోజుల క్రితం జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్(Peddapur) గురుకుల పాఠశాలలో (Gurukula Students) అస్వస్థతకు గురైన ఇద్దరు విద్యార్థులు హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్లో(Nims hospital) చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్(MLA Sanjay) ఫకీర్ కొండాపూర్ గ్రామనికి చెందిన ఆడేపు గణేష్, మెట్పల్లి పట్టణానికి చెందిన రాపర్తి హర్షవర్ధన్ అనే విద్యార్థులను ఆదివారం పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
డాక్టర్స్‌తో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ఉండటం వలన నియోజకవర్గంలో లేనని, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పాఠశాలను సందర్శించి భవిష్య త్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని తెలిపారు. కాగా, పెద్దాపూర్ గురుకుల స్కూల్లో గురువారం అర్ధరాత్రి రాజారపు గణాధిత్య (13) అనే విద్యార్థి మరణించగా, మరో ఇద్దరు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.