జగిత్యాల : జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్కేటింగ్ క్రీడాకారులను(Skating players) జగిత్యాల(Jagithyala) ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అభినందించారు. జగిత్యాల పట్టణానికి చెందిన అద్వైత్, అభినవ్ సాయి, ప్రీతం స్పీడ్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి స్పీడ్ స్కేటింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్, బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా వారు సంజయ్ కుమార్‌ను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారిని ఎమ్మెల్యే సత్కరించి అభినందనలు తెలిపారు.