మారుతీనగర్, అక్టోబర్ 5 : ప్రమాద బాధితుడికి ప్రాథమిక చికిత్స చేసి ఆర్థిక సాయంచేసి ఉదారత చాటున్నారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. జగిత్యాల జిల్లా మెట్పల్లి కొత్తబస్టాండ్ సమీపంలో ఇబ్రహీంపట్నం మండల ం కోమటికొండాపూర్కు చెందిన శ్రీధ ర్ బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా కారు ఢీకొట్టింది.
తీవ్రగాయాలతో బాధపడతున అతడిని అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే గమనించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానకు పంపి రూ.3 వేల ఆర్థిక సాయం చేశారు.